సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్! అదేంటో తెలుసా?
Fri May 30, 2025 13:43 Entertainment
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నుంచి ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సందీప్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ‘అత్తమాస్ కిచెన్’ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి జాడీని సందీప్ రెడ్డి వంగాకు పంపించారు. దానితో పాటు ఓ ప్రేమపూర్వక సందేశాన్ని కూడా జతచేశారు.
ఇది కూడా చదవండి: వైజాగ్‌లో పలువురు సినీ ప్రముఖుల కీలక భేటీ! కమిటీ ఏర్పాటుపై నిర్ణయం..
ఈ అనూహ్య కానుకకు సందీప్ రెడ్డి వంగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవకాయ జాడీ ఫొటోను షేర్ చేస్తూ, "ఈ సర్‌ప్రైజ్ చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంటుంది" అని రాసుకొచ్చారు. చరణ్ దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో గతంలో కొంత వివాదం నడిచినట్లు వార్తలు వచ్చాయి. తొలుత దీపికా పదుకునేను ఎంపిక చేసి, కథా చర్చల అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించి, మరొక నాయికను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దీపిక పీఆర్ టీమ్ ద్వారా ఈ సినిమాకు చెందిన కొన్ని కథనాలు లీక్ అవుతున్నాయని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #SandeepVanga #SurpriseGift #RamCharanAndUpasana #Tollywood #ViralNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.